Header Banner

దేశంలో ఇంధన కొరత అంటూ మరో ఫేక్ ప్రచారం! ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే..

  Fri May 09, 2025 14:14        Business

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ సోషల్ మీడియాలో పలు ఫేక్ న్యూస్ వైరల్ గా మారుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే ఈ పోస్టులపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ఎప్పటకప్పుడు స్పందిస్తూ వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. పొరుగు దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా చమురు నిల్వల్లో కొరత ఏర్పడిందని, పెట్రోల్ డీజిల్ నిల్వలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘‘దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయిల్ సరఫరా వ్యవస్థ సజావుగా పనిచేస్తోంది. ఇంధనం విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన ఆందోళన అక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టాల్సిన పనిలేదు. బంకుల వద్ద అనవసర రద్దీని నివారించి, మెరుగైన సేవలు అందించేందుకు మాకు సహకరించండి’’ అంటూ ఇండియన్ ఆయిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices